సూపర్‌బజార్(కొత్తగూడెం): బాలలపై వేధింపులు, దోపిడీ వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు తగిన చర్యలు తీసుకోవడంలో ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ సూచించారు. సురక్షిత బాల్యం అభియాన్‌లో భాగంగా గురువారం బాబుక్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో బాలల రక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు పోక్సో చట్టం, బాలల హక్కులపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార
సంస్థ కార్యదర్శి రాజేందర్


