చండ్రుగొండ : త్వరితగతిన భూ రీసర్వే పూర్తి చేయాలని సర్వే అధికారులకు కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మండలంలోని సీతాయిగూడెంలో నిర్వహిస్తున్న సర్వే పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వేలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆర్‌ఐ తిరుపతిరావు, రైతులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల ప్రతిభ
ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ విద్యుత్ సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు యాదగిరిగుట్టలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ సాంస్కృతిక పోటీల్లో ఖమ్మం సర్కిల్ ఉద్యోగులు ప్రతిభ కనబరిచారు. జానపద గీతాల పోటీల్లో పురుషుల విభాగం నుంచి ఏ.శేఖర్‌బాబు ప్రథమ బహుమతి సాధించగా, వాయిద్య సంగీత విభాగంలో వి.ఫణికుమార్ రన్నరప్‌గా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలను గురువారం ఖమ్మంలో చీఫ్ ఇంజనీర్(ప్రాజెక్ట్స్) ఏ.సురేందర్, ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అభినందించారు.


