పామాయిల్‌ మొక్కల పంపిణీలో రికార్డు.. | - | Sakshi
Sakshi News home page

పామాయిల్‌ మొక్కల పంపిణీలో రికార్డు..

Oct 30 2026 12:45 AM | Updated on Oct 30 2026 12:45 AM

వివరాలు వెల్లడించిన

డీఓ శంకర్‌ నాయక్‌

అశ్వారావుపేటరూరల్‌: ఆయిల్‌ఫెడ్‌ నర్సరీల ద్వారా నెల రోజుల వ్యవధిలో రైతులకు రికార్డు స్థాయిలో పామాయిల్‌ మొక్కలను పంపిణీ చేశారు. గురువారం నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్‌ డివిజనల్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఓ వివరాలను వెల్లడించారు. అశ్వారావుపేట, అప్పారావుపేటలోని ఆయిల్‌ఫెడ్‌ నర్సరీల నుంచి ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రంలోని మరో ఎనిమిది జిల్లాలకు రికార్డు స్థాయిలో 6,598 ఎకరాలకు 3,76,096 పామాయిల్‌ మొక్కలను అందజేశామని తెలిపారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,233 ఎకరాలకు 1,84,280 మొక్కలు, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 2,140 ఎకరాలకు 1,21,976 మొక్కల పంపిణీ చేశామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరో 5,74,389 మొక్కలను పంపిణీ చేస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement