వివిధ పంటల
సాధారణ విస్తీర్ణం అంచనా (ఎకరాల్లో)
ఉద్యాన పంటలు
పెరగనున్న ఉద్యాన పంటలు
యాసంగి సాగు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యవసాయ శాఖ యాసంగి పంటల సాధారణ విస్తీర్ణాన్ని అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావం వల్ల గత సీజన్ కంటే ఈసారి సాగు తగ్గనుందని పేర్కొంది. 2025–26 సీజన్‌లో సాధారణ విస్తీర్ణం 2,07,005 ఎకరాలు కాగా 2026–27 సీజన్‌లో 1,51,803 ఎకరాలుగా అంచనా రూపొందించింది. దీంతో గత యాసంగితో పోలిస్తే 56,202 ఎకరాలు తక్కువ కావడం గమనార్హం. సాగునీటి వనరులు లేకపోవడం, వర్షాకాలంలో జిల్లాలో వర్షాలు సరిగా కురవక పోవడంతో సాధారణ విస్తీర్ణాన్ని కుదిస్తూ అంచనాను రూపొందించారు. ఎల్‌నినో పరిస్థితులలో వరి వేయవద్దని రైతులను చైతన్యం చేస్తున్నా నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో 39,300 ఎకరాలు సాగు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత యాసంగితో పోలిస్తే 50,048 ఎకరాలు వరి తగ్గనుంది. మొక్కజొన్న 28,003 ఎకరాలు తగ్గే అవకాశం ఉంది. సాధారణ పంటల్లో మొత్తం 61,834 ఎకరాలు తగ్గుతుండగా, ఉద్యాన పంటలలో 5,632 ఎకరాలలో పంటల విస్తీర్ణం పెరిగింది. వీటిలో ఆయిల్‌పామ్ 4,856 ఎకరాలు, కూరగాయలు 759 ఎకరాలు పెరుగుతున్నాయి. వ్యవసాయ పంటలలో పెసర 2,737 ఎకరాలు, వేరు శెనగ 1,111 ఎకరాలు, పొద్దు తిరుగుడు 447 ఎకరాలు, ఇతర పంటలు 5,914 ఎకరాలు పెరుగనున్నాయి.
పంట 2025–26 2026–27 తేడా
వరి 89,348 39,300 –50,048
మొక్కజొన్న 1,07,103.11 79,100 –28,003
జొన్న 622.15 1,122 –500
మినుము 263.35 3,000 2,737
పెసర 691 3,200 2,509
బొబ్బర్లు 6,931 3,070 –3.001
వేరు శెనగ 1,389.11 2,500 1,111
నువ్వులు 509.17 509 0
ఇతరాలు 390.75 6,305 5,914
కూరగాయలు 799 2,558 759
ఉల్లి 0 12 12
పండ్ల తోటలు 56 60 4
ఆయిల్‌పామ్ 5,619 10,475 4,856
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో 56,202 ఎకరాలు తగ్గుదల


