ఇల్లెందురూరల్: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశించారు. మండలంలోని బొజ్జాయిగూడెం ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసరాలు, వంట గది సామగ్రి, డైనింగ్ హాల్, పిల్లలకు వండిన ఆహారాన్ని పరిశీలించారు. మెనూ అమలుపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంట సిబ్బంది పరిశుభ్రత పాటించాలని, ఉపాధ్యాయులు, వంట సిబ్బంది భోజనం చేసిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. కాంపిటేటివ్ పరీక్షలకు కూడా విద్యార్థులు సన్నద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. విద్యార్థులు తమ ఇష్టానుసారం ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని చెప్పారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


