రైల్వే సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

రైల్వే సమస్యలు పరిష్కరించండి

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని దీర్ఘకాలిక రైల్వే సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాత్సవ, జీఎం సెక్రటరీ మల్లాది శ్రీనివాస్‌లను బుధవారం కలిసి పలు సమస్యలపై అందించిన లేఖలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ మున్సిపల్‌ రహదారిని డబుల్‌ రోడ్డుగా విస్తరించేందుకు 22 అడుగుల రైల్వే స్థలాన్ని కేటాయించాలని కోరారు. బూడిదగడ్డ, రైటర్‌ బస్తీ, రామవరం–గరిమెళ్లపాడులలో ఆర్‌యూబీలు, లెవల్‌ క్రాసింగ్‌లు నిర్మించాలని, సర్వారంలో రైతుల కోసం అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు. హేమచంద్రాపురం బైపాస్‌లో కొత్త ఆర్‌వోబీతో పాటు సింగరేణి మెయిన్‌ ఆస్పత్రి వద్ద ఉన్న పాత ఆర్‌వోబీని విస్తరించాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో రద్దయిన మణుగూరు–కాజీపేట, భద్రాచలం రోడ్‌–డోర్నకల్‌, బెల్గాం–మణుగూరు రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. కాకతీయ ఫాస్ట్‌ ప్యాసింజర్‌లో స్లీపర్‌ బోగీలను పునరుద్ధరించడంతోపాటు తిరుపతికి నేరుగా వారాంతపు రైలు నడపాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం రోడ్‌ స్టేషన్‌ను కొత్తగూడెం రైల్వే స్టేషన్‌గా పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు.

రైల్వే ఉన్నతాధికారులతో

ఎమ్మెల్యే కూనంనేని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement