సూపర్‌బజార్(కొత్తగూడెం): హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. గతంలో జరిగిన గొడవలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఎదురుగడ్డ గ్రామానికి చెందిన మేడి అఖిల్(20)పై గణేష్, సాత్విక్‌లు పగ పెంచుకుని హత్యకు పథకం రచించారు. ఈ క్రమంలో మద్యం తాగిస్తామని నమ్మించి గ్రామంలోని రేకుల షెడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ నెల19న తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గణేష్, సాత్విక్‌లు కత్తితో పొడిచి, సిమెంట్ ఇటుకతో ముఖంపై మోది హతమార్చారు. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిందితులు కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో దంత్యాల గణేష్ అలియాస్ గని, సిరిపురం సాత్విక్ అలియాస్ చిన్నుతోపాటు హత్యకు సహకరించిన ముద్దంగుల వెంకటేష్ అలియాస్ చిన్ని, తరాల ప్రదీప్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, ఇతరుల ప్రమేయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో టెక్నికల్ టీమ్ సహకారం కీలకంగా నిలిచిందని వివరించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల పాల్గొన్నారు.


