సీతంపేట బంజరను సందర్శించిన కేంద్ర బృందం | - | Sakshi
Sakshi News home page

సీతంపేట బంజరను సందర్శించిన కేంద్ర బృందం

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

జూలూరుపాడు(సుజాతనగర్‌): సుజాతనగర్‌ మండలం సీతంపేట బంజర గ్రామ పంచాయతీని బుధవారం కేంద్రం బృందం సందర్శించింది. గ్రామ పంచాయతీ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ (పరిశుభ్రత, పచ్చదనం) విభాగంలో జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్‌ అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం గ్రామ పంచాయతీని సందర్శించి, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని పరిశీలించింది. బృందం సభ్యులు గ్రామస్తులతో చర్చించి వివరాలను తెలుసుకున్నారు. 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కేంద్ర బృందంలో కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ(ఎంపీఆర్‌) కార్యదర్శి పినాకి తహబిల్దార్‌, కన్సల్టెంట్‌ సత్యజిత్‌ పాత్రో ఉన్నారు. డీపీఓ బి.అనూష, కొత్తగూడెం డీఎల్పీఓ కె.ప్రభాకర్‌, సుజాతనగర్‌ ఎంపీడీఓ బి.భారతి, ఎంపీఓ జె.ఎల్‌.జి.గాంధీ, సర్పంచ్‌ గుగులోత్‌ జానకిరామ్‌, పంచాయతీ కార్యదర్శి అజ్మీర నరసింహారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement