టేకులపల్లి: ఎకై ్సజ్ ఎస్ఐ హన్మంతరావు ఆధ్వర్యాన సిబ్బంది మంగళవారం మండలంలోని రేగులతండాలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రేగులతండాలోని వాగు సమీపాన తనిఖీలకు వెళ్లగా అక్కడ ఉన్న వ్యక్తి పరారయ్యారు. ఈ మేరకు పరి శీలించగా 100 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఉద్యోగులు పి.శ్రీనివాస్‌రావు, రామారావు, రజాలీ, వినయ్, నర్సిరెడ్డి పాల్గొన్నారు.
నాటుసారా స్వాధీనం..
చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి శివారులో పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నాటుసారా తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తిప్పనపల్లి శివారు మొహమ్మద్ నగర్ వెళ్లే మార్గంలో తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తారసడ్డాడు. ఆయన వద్ద పరిశీలించగా 90 నాటుసారా ప్యాకెట్లు లభించడంతో అన్నా రం తండా గ్రామానికి చెందిన గుగులోతు శ్రీను వద్ద తీసుకొస్తున్నానని అంగీకరించాడు. ఈమేరకు ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
అనుమతి లేకుండా
తరలిస్తున్న కలప సీజ్
దమ్మపేట: అనుమతి లేకుండా మారుజాతి కలప తరలిస్తున్న రెండు వాహనాలను మంగళవారం అటవీ అఽధికారులు సీజ్ చేశారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. మండలంలోని ముష్టిబండ బీట్ పరిధి గణేష్‌పాడులో అక్రమంగా తరలిస్తున్న మారుజాతి కలప లారీని స్వా ధీనం చేసుకున్నారు. ఇందులో రూ.26,813 విలువైన 5.5 టన్నుల కలప లభించింది. అలాగే, అచ్యుతాపురం బీట్ పరిధి చీపురుగూడెంలో రూ. 17,062 విలువైన 4.5టన్నుల కలప తరలిస్తున్నట్లు ట్రాక్టర్ సీజ్ చేసి కేసులు నమోదు చేశామని ఎఫ్ఆర్ఓ తెలిపారు.


