మ్యూల్‌ అకౌంట్ల కేసులో ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మ్యూల్‌ అకౌంట్ల కేసులో ముగ్గురి అరెస్ట్‌

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

● రూ.వందల కోట్ల సైబర్‌ నేరాల కేసులో పురోగతి ● కొత్తగూడెంలో ఇద్దరు, ఖమ్మంలో ఒకరి అరెస్ట్‌

● రూ.వందల కోట్ల సైబర్‌ నేరాల కేసులో పురోగతి ● కొత్తగూడెంలో ఇద్దరు, ఖమ్మంలో ఒకరి అరెస్ట్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సత్తుపల్లి, పెనుబల్లి మండలాలు కేంద్రంగా సాగిన సైబర్‌ నేరాల వ్యవహారంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) సిట్‌ దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈమేరకు నిందితులకు మ్యూల్‌ అకౌంట్లు సమకూర్చిన ముగ్గురిని ఖమ్మం, కొత్తగూడెం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సహకారంతో మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఆపై వీరిని విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని అబిడ్స్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది.

రూ.5 కోట్ల జమతో వెలుగులోకి..

2022లో కొత్తగూడెంకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.5 కోట్లు జమ అయ్యాయి. ఈక్రమాన సత్తుపల్లి, పెనుబల్లి మ్యూల్‌ అకౌంట్ల కేసుల దర్యాప్తులో భాగంగా ఈ లావాదేవీలను గుర్తించిన ప్రత్యేక బృందం, కొత్తగూడెం వన్‌టౌన్‌ పరిధిలో ఇద్దరిని, ఖమ్మంలో ఇంకొకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఖమ్మం సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీలు ప్రసాద్‌, ఫణిందర్‌, కొత్తగూడెం సైబర్‌ క్రైమ్‌ సీఐ నరేష్‌ ఆధ్వర్యాన వీరిని అదుపులోకి తీసుకోగా, లావాదేవీలు, ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఈ విషయమై కొత్తగూడెం సీఐ నరేష్‌ను వివరణ కోరగా హైదరాబాద్‌ నుంచి బృందానికి సహకారం అందించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement