తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

గుండాల: వయస్సు పెరిగినందున తాటి చెట్లు గీసేందుకు వెళ్లొద్దు, గతంలోనే దెబ్బతిని ఉన్నావని కుటుంబ సభ్యులు కోరినా పనిచేయడం మానుకోలేక వెళ్లిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామానికి చెందిన కోతి యాదగిరి(55) మంగళవా రం కల్లు గీసేందుకు వెళ్లాడు. ఆయన ఎంత సేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతుకుతుండగా చెట్టు కింద అపస్మారక స్థితిలో గాయాలపాలై మృతిచెంది కనిపించాడు. గ్రామంలో బుధవారం నుంచి దుర్గమ్మ ప్రతిష్ఠ వేడుకలు మొదలుకానుండగా, ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా, యాదగిరికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు.

పాఠశాలకు వెళ్లాలని మందలించినందుకు ఆత్మహత్య

దమ్మపేట: పాఠశాలకు వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని వడ్లగూడెం గ్రామానికి చెందిన చల్లా నాగేంద్రబాబు కుమార్తె నాగసంగీత(15) సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. దసరా సెలవుల తర్వాత పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి ఆమెను సోమవారం మందలించాడు. దీంతో నాగసంగీత ఇంట్లోనే పురుగుల మందు తాగగా, గమనించిన కుటుంబ సభ్యులు సత్తుపల్లికి, అక్కడి విజయవాడ తరలించగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందింది. ఘటనపై ఆమె తాతయ్య చెన్నారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement