కరువు సహాయక చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఎల్‌నినో నేపథ్యాన కరువు పరిస్థితులు నెలకొన్నందున జిల్లాలో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి ఏఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ జిల్లాలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సహాయక చర్యలను చేపడుతూ రైతు, కూలీలకు భద్రత కల్పించాలని కోరారు. అలాగే, విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదన వెనక్కి తీసుకుని, క్రాప్‌ హాలీడే పేరిట ఆందోళన సృష్టించడం మానుకోవాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.25వేల కోట్లు కేటాయించి శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ధర్నాలో నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు, తుపాకుల నాగేశ్వరరావు, రంగయ్య, ఎస్‌.కే.ఉమర్‌, భూక్యా హర్జ్యా, గడ్డం లాలయ్య, కొమురం సత్యనారాయణ, మూడ్‌ మాలు, గొగ్గెల రాజు, పూనెం కోటయ్య, కుంజ కృష్ణ, రమేష్‌, హిడ్మా తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట

ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యాన ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement