కండక్టర్‌ ప్రవళికకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కండక్టర్‌ ప్రవళికకు అండగా ఉంటాం

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

● దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు ● ఆస్పత్రిలో పరామర్శించిన ఈడీ వెంకన్న

● దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు ● ఆస్పత్రిలో పరామర్శించిన ఈడీ వెంకన్న

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): విధినిర్వహణలో ప్రయాణికురాలి దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మణుగూరు డిపో ఆర్టీసీ మహిళా కండక్టర్‌ ప్రవళికను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌.వెంకన్న సోమవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రవళిక, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడ్డ మహిళకు చట్టప్రకారం కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, విధినిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రవళిక ఆరోగ్య పరిస్థితిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వైద్యులతో మాట్లాడారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement