పాల్వంచ: హెచ్‌పీ గ్యాస్ గోదాం మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివా రం కొత్తగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొంగులేటిని పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి న్యాయం చేయాని కోరారు. దీంతో మంత్రి స్పందించి ఎస్పీరోహిత్ రాజుతో ఫోన్లో మాట్లాడి, కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ జీవనోపాధి కోసం సహాయం అందించాలని సివిల్ సప్లైకమిషనర్తో మాట్లాడారు. నిందితులైన జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు రద్దు చేస్తామని తెలిపారు. పద్మశాలి సంఘం నాయకులు ఎర్రగుంట సాంబశివరావు, గుండు రవికుమార్, ఇమంది ఉదయ్‌కుమార్, కన్నయ్య, రామకిషోర్, సతీష్, నవీన్, శ్రీనివాస్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


