జూలూరుపాడు: మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో వృద్ధాప్య పింఛన్ డబ్బులు తీసుకుని వస్తున్న ఇద్దరు వృద్ధులను ఏమార్చి నగదుతో ఉడాయించిన ఘటన సోమవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన వృద్ధులు గంజి కనకమ్మ, కొల్లి జగన్నాథం ఎస్‌బీఐలో పింఛన్ నగదు తీసుకుని బ్యాంకు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో హెల్మెట్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వృద్ధుల వద్దకు వచ్చాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త పథకం ప్రవేశపెట్టారని, పింఛన్‌గా వచ్చిన రూ.4 వేలతోపాటు, మరో రూ.2 వేలు కలిపి ఇస్తున్నారని వృద్ధులను నమ్మించాడు. చిల్లర తీసుకొస్తానంటూ వారి నుంచి రూ.4 వేలు నగదు తీసుకుని బైక్‌పై పారిపోయాడు. ఎంతసేపటికీ సదరు వ్యక్తి తిరిగి రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన వృద్ధులు గంజి కనకమ్మ, కొల్లి జగన్నాథం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్ ఎస్‌బీఐ వద్దకు వెళ్లి సీసీ కెమెరాల్లో ఫూటేజీలను పరిశీలించి, విచారణ చేపట్టారు.
పింఛన్ సొమ్ముతో ఉడాయించిన దుండగుడు


