ఘన వ్యర్థాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఘన వ్యర్థాల పరిశీలన

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

బూర్గంపాడు: మండలంలోని ఇరవెండి గ్రామపంచాయతీలో అమలవుతున్న ఘన వ్యర్థాల నిర్వహణను సోమవారం జిల్లా పంచాయతీ అధికారి అనూష పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో తడి, పొడి చెత్తలను వేరు చేసి సేకరించాలన్నారు. తడి వ్యర్థాల నుంచి కంపోస్ట్‌ ఎరువులు తయారు చేసుకోవాలని సూచించారు. పొడి చెత్తలో రీ స్లైకింగ్‌కు పనికి వచ్చే వ్యర్థాలను వేరు చేసి వాటిని విక్రయించి ఆదాయం పొందాలన్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

సర్పంచ్‌ అవినీతిపై

కలెక్టర్‌కు ఫిర్యాదు

దుమ్ముగూడెం: మండలంలోని నారాయణరావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్‌ నిధుల దుర్వి నియోగానికి వివిధ అక్రమాలకు పాల్పడుతున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరు తూ గ్రామ ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు సోమవారం కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్‌ గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల్లో అవకతవకలకు పాల్పడుతూ ప్రభుత్వ ధనాన్ని దుర్వి నియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఈ 12న ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌, డీపీఓకు ఫిర్యాదు చేశామని, ఇన్ని రోజులు గడుస్తున్నా విచారణకు అధికారులు రాలేదని కలెక్టర్‌కు వివరించారు. గ్రామంలో గ్రామసభలు నిర్వహించకుండా, ఎలాంటి పాలకవర్గ తీర్మానాలు లేకుండా పంచాయతీ రికార్డులను ఎవరికీ చూపించకుండా ఏకపక్షంగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలి పారు. స్పందించిన కలెక్టర్‌ అంకిత్‌ విచారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నూప రాధ, వార్డు సభ్యులు సీతమ్మ, ముగరాజు, శ్యామల, కొమరం జంపన్న, ఉబ్బ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement