నెల క్రితం అదృశ్యం.. తిరిగి వచ్చి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

నెల క్రితం అదృశ్యం.. తిరిగి వచ్చి ఆత్మహత్య

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

● మూడు రోజుల తర్వాత గుర్తింపు ● అనుమానాస్పద స్థితిలో యువకుడు, వివాహిత మృతి

● మూడు రోజుల తర్వాత గుర్తింపు ● అనుమానాస్పద స్థితిలో యువకుడు, వివాహిత మృతి

ఇల్లెందు: ఇల్లెందులోని గోవింద్‌ సెంటర్‌ దాసరి గడ్డలోని ఓ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న యువకుడు, వివాహిత మృతదేహాలను సోమవారం గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. దాసరిగడ్డకు చెందిన తెలకలపల్లి శ్రీనివాస్‌(27) అవివాహితుడు కాగా తల్లి దుర్గమ్మతో నివసిస్తున్నాడు. ఆయన ఇంటికి ఎదురుగా ఉండే కొవ్వాకుల కళ్యాణి(32)కి భర్త సాలయ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిద్దరు నెల క్రితం ఇళ్ల నుంచి వెళ్లిపోగా కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, శుక్రవారం రాత్రి శ్రీనివాస్‌ ఇంటికి చేరిన వీరిద్దరు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌ వెళ్లిపోయినప్పటి ఆయన తల్లి దుర్గమ్మ సోదరుడి ఇంట్లో ఉంటోంది. శుక్రవారం సాయంత్రం ఆమె వచ్చి ఇంటి ముందు శుభ్రం చేసి వెళ్లగా, అదేరోజు రాత్రి వెనుక తలుపు నుంచి శ్రీనివాస్‌, కళ్యాణి వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ వీరు ఆత్మహత్య చేసుకున్నా విషయం బయటకు రాలేదు. సోమవారం ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. నెల క్రితం ఇళ్ల నుంచి వెళ్లిపోయిన వీరిద్దరు మళ్లీ రావడం, శ్రీనివాస్‌ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈమేరకు మిస్సింగ్‌ కేసులను ఆత్మహత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లెందు సీఐ తాటిపాముల సురేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement