కుమురం భీమ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కుమురం భీమ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

భద్రాచలం: ఆదివాసీ గిరిజనుల హక్కుల పరిరక్షణకు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కుమురం భీమ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఐటీడీఏ ఏపీఓ(జనరల్‌) డేవిడ్‌ రాజ్‌ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో కుమురం భీం వర్ధంతి నిర్వహించారు. భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో గిరిజనుల ఆత్మగౌరవం, భూమి, అటవీ వనరులపై హక్కుల కోసం భీం పోరాడారని గుర్తుచేశారు.

గిరిజన దర్బార్‌ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

గిరిజన దర్బార్‌లో సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఏపీఓ డేవిడ్‌ రాజ్‌ సూచించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ గిరిజన గ్రామాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పా రు. ఈ కార్యక్రమాల్లో ఎస్‌డీసీ ఆనంద్‌కుమార్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ చందన, ఆర్సీవో అరుణకుమారి, ఏడీఎంహెచ్‌వో సైదులు, ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్‌, ఏపీవో పవర్‌ వేణు, ఏవో సున్నం రాంబాబు పాల్గొన్నారు.

ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌ రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement