మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి దేవాదాయశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. డీఆర్‌ఓ దంపతుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి శేష వస్త్రాలను బహూకరించి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట జీపీఓ రాములు, నర్సయ్య ఉన్నారు.


