ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ శాఖల్లో వాహనాలు లేని చోట వెంటనే కొనుగోలు చేయడమే కాక ఉద్యోగులు, డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్లసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.డ్రైవర్ల సమస్యలు, బకాయిల విషయమై ఇప్పటికే టీజీ జేఏసీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. తొలు త ఇటీవల మృతి చెందిన డ్రైవర్లకు నివాళులర్పించారు. హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ ఎం.డీ.సలీంతో పాటు కె.కోటేశ్వరరావు, బి.రామారావు, ఎస్.వీ.ప్రసాద్, గంగన్న, నర్సింహారావు, శ్రీనివాసరావు, ఆది నారాయణ, కె.రాఘవులు, నాగరాజు పాల్గొన్నారు.


