గుర్తింపు సంఘంపైనే ఆశలు! | - | Sakshi
Sakshi News home page

గుర్తింపు సంఘంపైనే ఆశలు!

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

ఆర్టీసీలో సుదీర్ఘకాలంగా

పరిష్కారానికి నోచుకోని సమస్యలు

ఇటీవల గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ

గెలిచిన సంఘాలు గళమెత్తుతాయని కార్మికుల భావన

విలీనం కోసం పోరాటం

చుంచుపల్లి: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో దాదాపు పదేళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. గెలిచిన యూని యన్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాయని కార్మికులు ఆశ పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖమ్మం రీజియన్‌ పరిధి లోని ఆరు డిపోల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నేతృత్వంలోని ఐక్య కూటమి, ఒక డిపోలో జేఏసీ కూట మి గెలిచిన విషయం తెలిసిందే. ఇక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

పదేళ్ల విరామానికి తెర

2016లో చివరిసారిగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో తెలంగాణ మజ్దూర్‌ యూ నియన్‌ విజయం సాధించింది. అనంతరం యూని యన్ల పదవీకాలాన్ని కొంతకాలం పొడిగించారు. 2019లో ఆర్టీసీలో 55 రోజులపాటు సుదీర్ఘ సమ్మె జరిగింది. ఆ సమయంలో 33 మంది కార్మికులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అనంతరం అప్పటి ప్రభుత్వం యూనియన్లను పక్కన బెట్టింది. సమస్యల పరిష్కారానికి డిపోకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసిన వెల్ఫేర్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే సమస్యలు ఆశించిన స్థాయిలో పరిష్కారం కాలేదు. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు డిమాండ్‌ చేయగా, ఇటీవల ఎన్నికలు నిర్వహించారు.

కార్మికుల సంఖ్య తగ్గి.. పనిభారం పెరిగి..

కొన్నేళ్లుగా ఆర్టీసీలో కార్మికుల సంఖ్య తగ్గడంతో పాటు పనిభారం పెరుగుతోంది. ఉద్యోగ విరమణ పొందినవారి స్థానాల్లో నియామకాలు చేపట్టడంలేదు. ఖమ్మం రీజీయన్‌లో ప్రస్తుతం 1,884 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో రోజువారీ కిలోమీటర్ల లక్ష్యాన్ని 480 నుంచి 550కు, ఆర్డినరీ సర్వీసుల్లో 360 నుంచి 450కు పెంచినట్లు కార్మికులు పేర్కొంటున్నారు. దీనివల్ల డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగినా సిబ్బంది, సౌకర్యాలు పెంచడంలేదు. బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం డ్రైవర్లు, కండక్టర్లకు ఇబ్బందులు తప్పంలేదు. గ్యారేజీల్లో అవసరమైన పనిముట్లు లేవని, మెకానిక్‌లు సైతం సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. గుర్తింపు కార్మిక సంఘంలో గెలిచిన యూనియన్లు సమస్యలను ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

ప్రధాన సమస్యలివే..

● విధుల కేటాయింపు, కిలోమీటర్ల లక్ష్యాలు, కేఎంపీఎల్‌ నిబంధనలు, సెలవులు, పనిభారం

● కార్మికులపై అధికారుల అసహనం, వేధింపులు, వేతన సవరణ

● ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఉద్యోగ భద్రత, ఇతర పెండింగ్‌ సమస్యల పరిష్కారం

● డిపో స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం.

పదేళ్ల నుంచి ఎన్నికలు లేకపోవడంతో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదిక లేకుండాపోయింది. ఇప్పుడా సమస్య లేదు. గెలిచినసంఘాలు సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తోపాటు కార్మికులకు ఇచ్చిన హామీల అమలుపైనా పోరాడతాం.

–ఇసనపల్లి సామ్యూల్‌,

ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కొత్తగూడెం డిపో సెక్రటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement