చంటి పిల్లలకు తల్లిపాలు ఇచ్చేందుకు అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో కొంతకాలం క్రితం వాసవి క్లబ్ ద్వారా ఓ దాత అమ్మకు గౌరవం పేరుతో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. అది కొంతకాలం తల్లులకు ఉపయోగకరంగా మారగా.. కొద్ది రోజుల క్రితం ఈ గదికి సంబంధించిన అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు ఇబ్బందులు పడుతుండడంతో అమ్మకు గౌరవం ఇదేనా..? అంటూ ప్రయణికులు మండిపడు తున్నారు. ఇకనైనా ఆర్టీసీ డిపో అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
– అశ్వారావుపేటరూరల్


