ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా జూనియర్ కళాశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–19 బాలబాలికల క్రికెట్ జట్లను ఎంపిక చేశారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఎంపిక పోటీలకు 120 మంది క్రికెటర్లు హాజరయ్యారు. పీడీలు విజయ్‌కుమార్, శ్రీను ఆధ్వర్యాన పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేయగా జట్ల వివరాలను క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డీ.మూసీకలీం ప్రకటించారు. బాలుర జట్టుకు డి.ఉన్నత్, ఎస్.పూర్ణ అజయ్, తోలేశ్వర్‌నాథ్, కె.కేశవ్ వికాస్, బి.సందీప్, ఏ.దేవానాయక్, బి.నందరాజ్ నాయక్, జె.వరుణ్, ఎం.ఏ.రెహమాన్, వి.దక్షిత్‌రెడ్డి, జె.జులేమాన్, ఎస్.డీ.ఆఫ్రిద్, పి.పూజిత్‌కుమార్, ఎం.డీ.అమాన్ జైద్, బి.సృజన్, ఈ.ఉదయ్‌కళ్యాణ్, బి.చరణ్ సాయి, బి.సాయిరాం, ఎం.రాహుల్ ఎంపికయ్యారని తెలిపారు. అలాగే, బాలికల జట్టుకు బి.యమున, పి.యశస్విని, కె.మనస్విని, ఎన్.చిట్టి భవాని, టి.గ్రీష్మ, కె.గౌరీఅంజలి, మేఘన, ఎస్.కే.తాజ్‌ఆఫ్సా, డి.సాయికీర్తన, ఏ.లలిత బెస్లీ, బి.స్పందన, ఎం.కావేరి, వై.ఉషశ్రీ, పి.నవ్య, కె.ధోనిశ్రీ, డి.ఆరాధ్యి ఎంపికయ్యారు.


