సరదాగా సాగి.. విషాదంగా ముగిసి.. | - | Sakshi
Sakshi News home page

సరదాగా సాగి.. విషాదంగా ముగిసి..

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

చర్ల: ఆహ్లాదం, ఆనందం కోసం సరదాగా సాగిన ఓ విహారయాత్ర ప్రమాదవశాత్తు జరిగిన ఓ సంఘటన చివరకు విషాదంతో ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో గల నంబి జలపాతం సందర్శనకు వెళ్లిన వారిలో ఓ ఇంటర్‌ విద్యార్థి జలపాతంలో మునిగి ఆదివారం మృతి చెందాడు. వివరాలిలా.. మండల కేంద్రంలోని పాతచర్లకు చెందిన మోర్ల వెంకన్న కుటుంబంతో పాటు మరో మూడు కుటుంబాల వారు ఆదివారం ఉదయం బీజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నంబి సమీపాన ఉన్న జలపాతం సందర్శనకు వెళ్లారు. అక్కడ జలపాతం పైకి ఎక్కి కిందకు దిగుతున్న క్రమాన మోర్ల వెంకన్న కుమారుడు గిరీష్‌ (18) కాలు జారి జలపాతంలో పడి మునిగిపోయి మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానికులు ఊసూరు పోలీసులకు సమాచారం అందించగా.. వారు మృతదేహాన్ని వెలికితీసి పంచనామా కోసం ఊసూరు వైద్యశాలకు తరలించారు. కాగా, మృతుడు గిరీష్‌ చర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని ఆశపడిన ఆ తల్లిదండ్రులు జలపాతం తమ కొడుకును బలి తీసుకుందని బోరున విలపించిన తీరు అందరినీ కలిచివేసింది.

నంబి జలపాతంలో మునిగి

చర్ల విద్యార్థి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement