అశ్వాపురం: ఎల్‌నినోపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్‌మెస్లీ అన్నారు. మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో వీబీ జీరామ్‌జీ పథకంలో నిర్మిస్తున్న ఫారంపాండ్‌ను శనివారం పరిశీలించారు. మొండికుంట గ్రామ పంచాయతీలో వీబీ జీరామ్‌జీ పనులను సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఎల్‌నినోతో కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు వీబీజీరామ్‌జీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని రైతువేదికలో అశ్వాపురం, మణుగూరు మండలాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీబీజీరామ్‌జీ సిబ్బందితో నిర్వహించిచన సమావేశంలో మాట్లాడారు. భూగర్భజలాలు అడుగంటకుండా వీబీజీరామ్‌జీ పథకంలో ఫారంపాండ్‌లు నిర్మించుకోవాలన్నారు. కొందరు పంచాయతీ కార్యదర్శులు డీఎస్‌ఆర్‌ను సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. జిల్లా పంచాయతీ అధికారి అనూష, ఎంపీడీఓ ముత్యాలరావు, మణుగూరు ఎంపీఓ వెంకటేశ్వరరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్
జాన్‌వెస్లీ


