సైబర్‌ నేరాలపై తక్షణమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై తక్షణమే స్పందించాలి

Oct 25 2026 12:35 AM | Updated on Oct 25 2026 12:35 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సైబర్‌ నేరాల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశించారు. సైబర్‌ వారియర్లతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. బాధితులకు పోలీస్‌ స్టేషన్‌ స్థాయిలోనే న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. ఎన్సీఆర్పీ, జీఆర్‌ఎం, ఎంఆర్‌ఎఫ్‌, సహయోగ్‌, సమన్వయ, సైబర్‌ క్రైమ్‌ అనలిటిక్స్‌ అండ్‌ ప్రాసిక్యూషన్‌ సిస్టమ్‌ వంటి పోర్టళ్ల విధులు, వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. 1930 సైబర్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులపై స్పందించి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. సైబర్‌ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో సైబర్‌ సెల్‌ సీఐ నరేష్‌, ఎస్సై జుబేదా బేగం, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ రోహిత్‌ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement