రామాలయ ఈఓ దామోదర్‌రావు
భద్రాచలం: భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈఓ దామోదర్‌రావు అన్నారు. అభివృద్ధి పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల మెరుగుదల, ఆలయ పరిసరాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లింగాల సాయిబాబు, నిర్మాణ సంస్థ బాధ్యులు పాల్గొన్నారు.
వ్యవసాయ కళాశాలను సందర్శించిన విద్యార్థులు
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలను ఖమ్మం జిల్లా వేంసూ రు మండలం కందుకూరు జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల విద్యార్థులు శనివారం సందర్శించారు. విజ్ఞాన యాత్రలో భాగంగా 200 మంది విద్యార్థులు కళాశాలలోని వ్యవసాయ, ఉద్యా న పంట క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్‌కుమార్ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, చిరు ధాన్యాల సాగు, విధానం, కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ నాగాంజలి, డాక్టర్ శ్రీనివాసరావు, శివ, శ్రావిక తదితరులు పాల్గొన్నారు.


