సూపర్‌బజార్(కొత్తగూడెం): రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం రాహత్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించడంతో పాటు, చికిత్స ఖర్చు ల చెల్లింపులు, కేసుల ధృవీకరణ, క్లెయిమ్‌ల పరి ష్కార ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి శనివారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఏడు రోజులపాటు రూ.1.5 లక్షల వరకు నగదురహిత వైద్య చికిత్స అందించాలని వివరించారు. కలెక్టరేట్ నుంచి వీసీకి హాజరైన అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పీఎం రాహత్ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డీఆర్‌ఓ పద్మావతి, డీపీఓ అనూష, జిల్లా రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి, డీఆర్‌ఎం బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు


