అండర్‌–17 క్రికెట్‌ జట్టుకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అండర్‌–17 క్రికెట్‌ జట్టుకు ఎంపిక

Oct 25 2026 12:35 AM | Updated on Oct 25 2026 12:35 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్‌–17 బాలుర క్రికెట్‌ జట్టుకు కొత్తగూడేనికి చెందిన బి.తనిష్క్‌ ఎంపికయ్యాడు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచి జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న తనిష్క్‌ సోమవారం నుంచి గద్వాల్‌లో జరగనున్న ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా శనివారం విద్యార్థిని నలంద వివేకవర్థిని విద్యాసంస్థల సీఈఓ చైతన్య కృష్ణ, ఏఓ రమేష్‌ అభినందించి, మెమెంటోను అందజేశారు.

దరఖాస్తుల ఆహ్వానం

చుంచుపల్లి: కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి డీఎంఎల్టీ, డయాలసిస్‌ టెక్నీషియన్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో కోర్సుకు 30 సీట్లు ఉన్నాయని, ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని హార్డ్‌ కాపీ తమకు సమర్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement