రోడ్డు ప్రమాదాలను నివారించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

Oct 24 2026 5:05 AM | Updated on Oct 24 2026 5:05 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, గాయపడిన వారి వివరాలతోపాటు ప్రమాదాల నివారణకు చేపట్టా ల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్‌ 15 వరకు 410 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. వీటిల్లో 191 మంది ప్రాణాలు కోల్పోగా, 26 మంది తీవ్రంగా, 383 మంది స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ప్రమాదాలు అధికంగా నమోదవుతున్న రహదారులను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రోడ్‌ మార్కింగ్‌లు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదకర మలుపులు, కూడళ్లు, రహదారులపై ఉన్న ఇతర సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. రహదారుల భద్రతకు సంబంధించిన పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో తగిన చర్యలు తీసుకుని, బాధితులకు సకాలంలో సహాయం అందించాలని అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి భూషిత్‌ రెడ్డి, డీఆర్‌ఎం జి.బాలాజీ, జిల్లా ఇంటర్మీడియట్‌ శాఖ అధికారి సీహెచ్‌ వెంకటేశ్వర్లు, డీఎస్పీ వెంకన్న బాబు, జిల్లా వైద్య శాఖ అధికారులు, ఆర్‌అండ్‌బీ, ట్రాఫిక్‌, కలెక్టరేట్‌ సి.సెక్షన్‌ అధికారులు పాల్గొన్నారు.

డీఆర్వో పద్మావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement