మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

Oct 24 2026 5:05 AM | Updated on Oct 24 2026 5:05 AM

అశ్వాపురం/కరకగూడెం/మణుగూరు రూరల్‌: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ రోహిత్‌ రాజు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన మణుగూరు, అశ్వాపురం, కరకగూడెం పోలీస్‌ స్టేషన్లలో తనిఖీ చేశారు. కేసుల వివరాలపై ఆరా తీసి మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మణుగూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నూతనంగా నిర్మిస్తున్న మూడు గదుల నిర్మాణ పనులను, పినపాక మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్‌ స్టేషన్‌ భవన పనులను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మణుగూరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, సీఐలు వెంకటేశ్వరరావు, ఎల్లయ్య, నాగబాబు, ఎస్‌ఐలు పీవీఎన్‌ రావు, రఘు, రాజేష్‌, రవూఫ్‌ పాల్గొన్నారు.

ఎస్పీ రోహిత్‌ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement