వారం రోజుల్లో రెండు పతకాలు | - | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో రెండు పతకాలు

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలం పట్టణానికి చెందిన ఎస్‌బీఐ రిటైర్డ్‌ అధికారి డీవీ శంకరరావు ప్రపంచ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో సత్తా చాటారు. అమెరికాలోని రెనో నగరంలో ఈ నెల 22న జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ ఎక్విప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు. ఈ నెల 15న జరిగిన క్లాసిక్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. 2012లో గుండె బైపాస్‌ శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన 73 ఏళ్ల వయసులో రెండు పతకాలు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. ఇప్పటివరకు 10 పతకాలు సాధించిన శంకరరావును పలువురు అభినందించారు.

ప్రభుత్వాస్పత్రిలో

కాన్పుల సంఖ్య పెంచాలి

టేకులపల్లిరూరల్‌: ప్రభుత్వాస్పత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకా రాం రాథోడ్‌ సూచించారు. మండలంలోని సులానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లు తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడు తూ పీహెచ్‌సీలో కాన్పుల సంఖ్య పెంచాలని, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించా లని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సుందర్‌ పాల్గొన్నారు.

కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుడు, వర్కర్‌పై పోక్సో కేసు

ఇల్లెందురూరల్‌: మండలంలోని రొంపేడు బాలికల ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుడు, కాంట్రాక్ట్‌ వర్కర్‌పై ఈ నెల 18న పోక్సో కేసు నమోదు కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏటీడీఓ భారతీదేవి శుక్రవారం ఆశ్రమ పాఠశాలను సందర్శించి విచారణ నిర్వహించారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి, వారి ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బాలికల ఆశ్రమ పాఠశాలలో

పర్యవేక్షణ లోపం

బాలికల ఆశ్రమ పాఠశాలలో పర్యవేక్షణ లోపం అవాంఛనీయ ఘటనకు బీజం వేసిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 18న బాధిత కుటుంబం ఫిర్యాదుతో ఇల్లెందు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైనా ఇప్పటివరకు సమగ్ర విచారణ చేపట్టలేదు. కేసు నమోదు విషయం శుక్రవారం వరకు తమ దృష్టికి రాలేదని హెచ్‌ఎం పద్మ తెలపడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement