జన గణన పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జన గణన పారదర్శకంగా నిర్వహించాలి

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో జనాభా గణన పారదర్శకంగా నిర్వహించాలని భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ సూచించారు. జనాభా గణన ఫేస్‌–2 నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్‌లో రెండు రోజులు నిర్వహించిన సమగ్ర శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జనాభా గణన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని చెప్పారు. కాగా, సెన్సెస్‌ శాఖ రూపొందించిన 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిపై అధికారులకు సమగ్ర శిక్షణ అందించారు. సీపీఓ జె.సునీత, ఆర్డీఓ డి మధు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూష, డీఈఓ శంభూప్రసాద్‌, మాస్టర్‌ ట్రైనర్లు రవీందర్‌ నాయక్‌, శివ, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శి

సంతకం ఫోర్జరీ

పాల్వంచరూరల్‌: పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటనలో ఇద్దరిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బస్వతారాకకాలనీ గ్రామపంచాయతీ పరిధిలో కోళ్లఫారం ఏర్పాటుకు పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇవ్వలేదు. బానోత్‌ వీరన్న, రామా అనే వ్యక్తులు కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి, కోళ్లఫారం నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి అజ్మీరా రాంబాబు ఈ నెల 19న ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్‌ శుక్రవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement