ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): తమ వీధి గుండా విద్యుత్ లైను వేయవద్దని ఒడ్డుబజార్ వాసులు ఆందోళన చేపట్టి పనులను అడ్డుకున్నారు. కమలాపురం నుంచి పెంట్లం సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిమిత్తం మండలకేంద్రంలోని ఒడ్డుబజార్ నుంచి 33 కేవీ లైన్ పనులు శుక్రవారం ప్రారంభించారు. తమ వీధిలో విద్యుత్ లైన్ ఏర్పాటు చేయొద్దని స్థానికులు ఆందోళనకు దిగారు. జనావాసాల మధ్య లైన్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్తంభాలు, విద్యుత్‌లైను వేసేందుకు వచ్చిన అధికారులను, సిబ్బందిని అడ్డుకున్నారు. ఈక్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో వచ్చి ఒంటిపై పోసుకుంటుండగా, పలువురు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో అధికారులు పనులు నిలిపివేసి వెనుదిరిగారు. కాగా, ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన నవీన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయసింహారెడ్డి తెలిపారు.
ఒకరిపై కేసు నమోదు


