జూలూరుపాడు: ఎల్‌నినో ప్రభావం నుంచి బయటపడేందుకు గ్రామాల్లో వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భూగర్భ జలాల పెంపుదలకు అవసరమైన పనులను గుర్తించి పనులు చేపట్టాలని డీఆర్డీఓ, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) విద్యా చందన అన్నారు. శుక్రవారం జూలూరుపాడు మండలంలో ఆమె వీబీజీ రామ్ జీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జలసిరి పనుల ప్రాముఖ్యత, నీటి సంరక్షణ, భూగర్భ జాలల పెంపుదల, నీటి వనరుల అభివృద్ధి వంటి అంశాలపై కూలీలకు అవగాహన కల్పించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు, సర్పంచ్‌లకు ఆమె దిశానిర్దేశం చేశారు. రైతులకు ఉపయోగకరంగా ఉండే పంట కుంటల నిర్మాణం చేపట్టాలన్నారు. ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంపీఓ తులసీరామ్, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధశాఖల అధికారులు, వీబీజీ రామ్ జీ సిబ్బంది పాల్గొన్నారు.
డీఆర్డీఓ విద్యా చందన


