కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫాయిబస్తీ ఏరియాలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉద యం 7 గంటల వరకు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు, 2 త్రిచక్ర వాహనాలను గుర్తించి జరిమానా విధించారు. 87 ఐఎంఎఫ్‌ఎల్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడారు. గంజా యి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనింంచాలని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణకు ఓటీపీ, యూపీఐ మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, అనుమానా స్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, మతసామరస్యాన్ని కాపాడాలని కోరారు. సీఐలు ఇంద్రసేనారెడ్డి, జితేందర్, సుమా రు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు


