భద్రాచలం: జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సొసైటీల ఆర్థిక కార్యకలాపాలపై సమీక్ష జరిపి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ ఆదేశించారు. గురువారం ఆయన ఐటీడీఏలో జీసీసీ అధికారులు, ఆడిట్ బృందంతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు, వ్యయ వివరాలు, భవిష్యత్ ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలను ఈ నెల 28వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. సెప్టెంబర్ 2026 వరకు ఉన్న బకాయిలను ఏటీడీఓలు, గురుకులాల ప్రిన్సిపాళ్లతో సరిచూసుకోవాలని జీసీసీ మేనేజర్లకు చెప్పారు. జీసీసీ డీఎం రామానందం, జీసీసీ మేనేజర్ జయరాజ్, ఆడిట్ అధికారులు, డివిజనల్ జీసీసీ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్


