గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

అశ్వారావుపేటరూరల్‌: అభివృద్ధి, ఉపాధి కల్పనలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు పారిశ్రామికవేత్తలు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరారు. గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సెమినార్‌లో ఆయన పాల్గొని, పలు అంశాలపై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు విస్తరించాలన్నారు. పారిశ్రామిక పెట్టుబడులు, కొత్త పరిశ్రమలకు జిల్లాలోని ప్రాంతాలు అనుకూలమని వివరించారు.

జాతీయ సెమినార్‌లో

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement