అశ్వారావుపేటరూరల్: వివాదాస్పద భూముల్లో రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలని సత్తుపల్లి ఎఫ్‌డీసీ డీఎం చంద్రమౌళి సూచించారు. అశ్వారావుపేట ప్రాంతం సత్తుపల్లి ఎఫ్‌డీసీ పరిధిలో ఉండగా.. ఇక్కడి ఓ భూమిపై వివాదం నెలకొనడంతో గురువారం ఆయన పర్యటించారు. అటవీ, రెవెన్యూ అధికారులతో కలిసి అశ్వారావుపేట మండలం రామన్నగూడెం రెవెన్యూ పరిధి 573 ఎకరాల రీ సర్వేను పరిశీలించి భూములు, పూర్వ మ్యాప్‌లు, రికార్డుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. సర్వే వేగంగా చేపట్టి సరిహద్దులను నిర్ణయించాలని ఆదేశించారు. సర్పంచ్ మడకం నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ మడకం స్వరూప, ఫారెస్ట్ రేంజర్ మురళి, సర్వేయర్ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


