సూపర్‌బజార్(కొత్తగూడెం): శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు ఎప్పటికీ మరువలేనివని ఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినో త్సవం సందర్భంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం అమరవీరుల స్తూపం వద్ద ఎస్పీ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం సా యుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఉద్యోగులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, ఉగ్రవాదం, నక్సలిజం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తి గా తీసుకుంటూ పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. డీఎస్పీలు ఆది నారాయణ, ఆర్.సతీష్‌కుమార్, వెంకన్నబాబు, రవీందర్‌రెడ్డి, సత్యనారా యణ, మల్లయ్య స్వామి, అరుణ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజ్


