భద్రాచలంఅర్బన్: సద్దుల బతుకమ్మ సందర్భంగా భద్రాచలంలో గోదావరి వద్దకు వచ్చిన మహిళలు నిమజ్జనం చేసే మార్గం లేక ఒడ్డునే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో కొన్ని ఒడ్డున నీటిలో తేలుతుండగా, మరికొన్ని బురదలో చిక్కుకున్నాయి. వీటికి తోడు ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు పేరుకుపోవడంతో ఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారా యి. పూలు సహజంగా కుళ్లిపోయేవే అయినా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించకపోతే గోదా వరి పరిశుభ్రతకు సమస్యగా మారే అవకాశం ఉంది. ఈమేరకు సంబంధిత అధికారులు చొరవ చూపాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.


