దసరాకు కిక్కే కిక్కు ! | - | Sakshi
Sakshi News home page

దసరాకు కిక్కే కిక్కు !

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

పాల్వంచరూల్‌: దసరా పండుగ సందర్భంగా జిల్లాలో రూ.6కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగా యి. రెండు రోజుల పాటు జిల్లాలోని బార్లు, వైన్స్‌ కిటకిటలాడుతూ కనిపించాయి. కొన్నిచోట్ల వైన్స్‌లో బీర్లు లభించక మద్యం ప్రియులు ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. జిల్లాలో 88 వైన్స్‌, 13 బార్లు ఉండగా, వైరాలోని డిపో ద్వారా రూ.10.57 కోట్ల విలువైన మద్యం చేరినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది దసరా పండుగ రోజే గాంధీ జయంతి రావడంతో ముందుగానే రూ.9.50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. ఈసారి షాప్‌లకు రూ.10.57కోట్ల విలువైన మద్యం చేరగా, పండుగ రెండు రోజుల్లో రూ.6కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అంచనా ఉందని జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

రెండు రోజుల్లో రూ.6కోట్ల

మద్యం అమ్మకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement