దసరా వేడుకలకు హాజరై వస్తూ ప్రమాదంలో మృతి | - | Sakshi
Sakshi News home page

దసరా వేడుకలకు హాజరై వస్తూ ప్రమాదంలో మృతి

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

దసరా వేడుకలకు హాజరై వస్తూ ప్రమాదంలో మృతి

మణుగూరు టౌన్‌/మణుగూరు రూరల్‌: దసరా ఉత్సవాలు వీక్షించి వస్తుండగా మండలంలోని కూనవరం సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన కేసుపాక నవీన్‌(20) మణుగూరులోని తన స్నేహితుడైన అభినయ్‌ పాల్‌ అలియాస్‌ కల్యాణ్‌ ఇంటికి మంగళవారం వచ్చాడు. వీరి స్నేహితులు మనోజ్‌, సిద్దు, పవన్‌తో కలిసి పీ.వీ.కాలనీలోని భఽద్రాద్రి స్టేడియంలో నిర్వహించిన రామ్‌లీలా, జమ్మి వేడుకలను చూసేందుకు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. వేడుకలు ముగిశాక అర్ధరాత్రి తిరిగి వస్తుండగా.. కూనవరం గ్రామ సమీప కోడిపుంజుల వాగు బ్రిడ్జి రోడ్డుపై నడిచి వస్తున్న మహిళను ఒక బైక్‌ ఢీట్టింది. దీంతో ఆ బైక్‌ వెనుక కూర్చున్న నవీన్‌ కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో స్నేహితులు మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై నవీన్‌ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement