ఇల్లెందు: ఇల్లెందు ఫారెస్ట్ గ్రౌండ్‌లో మంగళవారం రాత్రి దసరా వేడుకలు నిర్వహించగా పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు. రాత్రి 8గంటల నుంచి 12 వరకు ఉత్సవాలు జరగగా.. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ పోరిక బలరామ్‌నాయక్ ప్రారంభించారు. అనంతరం మ్యూజి కల్ నైట్, సినీ, టీవీ కళాకారుల ఆటపాటలు ఏర్పాటుచేశారు. సినీ దర్శకుడు కాంపాటి సాయిలు హాజరుకాగా, కళాకారులు అభి, రాజమౌళి, ప్రసాద్, సౌమ్య, వినోద్ తదితరులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కాగా, మైదానానికి భారీగా జనం హాజరైనా వెనుక ఉన్న వారికి వేదిక కనిపించకపోవడంతో నిలబడి మరీ స్క్రీన్లలో చూడాల్సి వచ్చింది. చివరకు రావణవధతో కార్యక్రమాలు ముగిశాయి. మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ రాజు, మార్కెట్ చైర్మన్ బానోతు రాంబాబు, కమిషనర్ సందీప్, డీఈ నవీన్, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు బోళ్ల సూర్యం, మండల రాము, నాయకులు దొడ్డ డానియేల్, మడు గు సాంబమూర్తి తదితరులు పాల్గొనగా, డీఎస్పీ వెంకన్నబాబు, సీఐలు టి.సురేష్, బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యాన 220 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి


