పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన భక్తజనం

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

● దసరా సందర్భంగా కిటకిటలాడిన పెద్దమ్మతల్లి ఆలయం ● ముగిసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

● దసరా సందర్భంగా కిటకిటలాడిన పెద్దమ్మతల్లి ఆలయం ● ముగిసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

పాల్వంచరూరల్‌: మండలంలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయం దసరా సందర్భంగా భక్తజనంతో కిటకిటలాడింది. ఈనెల 11నుంచి నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు బుధవారం ముగిశాయి. ఈక్రమాన దసరా సందర్భంగా మంగళవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో పెద్దమ్మతల్లి దర్శనం ఇచ్చారు. అలాగే, సాయంత్రం అమ్మవారిని రథోత్సవం ఉరేగింపు గుడి నుంచి కేశవాపురం వరకు సాగింది. ఇందులో అమ్మవారి వేషధారణతో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. ఆతర్వాత కోనేరులో హంసవాహనంపై అమ్మవారి తెప్పోత్సవం, జమ్మి చెట్టు వద్ద శమీ పూజలు నిర్వహించారు. కాగా, దసరా సందర్భంగా సోమవారం అర్ధరాత్రి నుంచే వివిధ ప్రాంతాల భక్తులు వాహనాల పూజ కోసం బారులుదీరారు. దీంతో కేశవాపురం నుంచి ఆలయం వరకు వాహనాలు నిలిచి పోయాయి. ఇక బుధవారం ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించాక, యాగశాలలో అర్చకులు పూర్ణాహుతి సమర్పించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement