రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

టేకులపల్లిరూరల్‌: రెండు మోటార్‌ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టేకులపల్లి మండలంలోని ఎర్రాయిగూడెం స్టేజీ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఎర్రాయిగూడెంకు చెందిన వర్సా వీరస్వామి(40) టేకులపల్లిలో చికెన్‌ కొనుక్కొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా మోదుగులగూడెంకు చెందిన మాడె రాజేష్‌ తన భార్య మీనాక్షితో బైక్‌పై బోడు వైపు నుంచి వస్తూ వీరస్వామి వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగానే వీరస్వామి మృతి చెందాడు. కూలీ పనులతో జీవనం సాగించే వీరస్వామి మృతిపై ఆయన భార్యసారక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు బోడు ఎస్‌ఐ రాజమౌళి తెలిపారు.

విద్యుదాఘాతంతో యువకుడు..

కరకగూడెం: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందడంతో దసరా పండుగ రోజు కుటుంబంలో విషా దం చోటు చేసుకుంది. మండలంలోని రాయనపేటకు చెందిన చర్చ నితిన్‌(20) తన పొలంలోని మోటార్‌ ఆన్‌ చేసేందుకు వెళ్లాడు. విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో పైన ఉన్న లైన్‌ను తీగలను తగిలించే ప్రయత్నంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన తల్లి నాగరత్నం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో రైతు..

జూలూరుపాడు(సుజాతనగర్‌): సుజాతనగర్‌ మండలం వేపలగడ్డకు చెందిన ఓ రైతు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వేపలగడ్డకు చెందిన చెన్నబోయిన సత్యనారాయణ(50) వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేస్తుంటాడు. ఆయన బుధవారం పొలంలో వ్యవసాయ పనులు ముగిశాక పచ్చిగడ్డి మోపు బైక్‌పై పెట్టుకుని ఇంటికి వస్తున్నాడు. గ్రామంలో రోడ్డు దాటుతుండగా ఖమ్మం వైపు నుంచి మణుగూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన సత్యనారాయణను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement