కిన్నెరసానిలో బోటు షికారు | - | Sakshi
Sakshi News home page

కిన్నెరసానిలో బోటు షికారు

Oct 19 2026 12:43 AM | Updated on Oct 19 2026 12:43 AM

పాల్వంచరూరల్‌: కిన్నెరసానిలో ఆదివారం పలువురు పర్యాటకులు జలవిహారం చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు పర్యాటక ప్రాంతానికి తరలించారు. కిన్నెరసానిలోకి ప్రవేశించిన వాహనాల రుసుం, సఫారీ, బోటు షికారు ద్వారా రూ.63,005 ఆదాయం లభించింది.

దరఖాస్తుల ఆహ్వానం

చుంచుపల్లి: జిల్లాలోని పీఎం–జన్మన్‌ పథకం కింద ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ) లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టును కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులని, రూ. 52,000 వేత నం చెల్లిస్తామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాంఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 24న ఐడీఓసీ లో నిర్వహించే వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

నాటు తుపాకీ,

గంజాయి స్వాధీనం

దమ్మపేట: నాటు తుపాకీతోపాటు రూ.3లక్షల విలువైన గంజాయిని ఆదివారం పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. పాల్వంచ డీఎస్పీ సతీష్‌ కుమార్‌ కథనం ప్రకారం.. దమ్మపేట మండలం కొడిశెలగూడెం గ్రామానికి చెందిన పెనుబల్లి నాగు వద్ద అటవీ జంతువులను వేటాడే నాటు తుపాకీ ఉందని సమాచారం అందింది. దీంతో ఈ నెల 16న దమ్మపేట అటవీశాఖ సిబ్బంది అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. నాటు తుపాకీ, వేటకు ఉపయోగించే మందుగుండు సామగ్రి లభించింది. వీటితోపాటు 5.3కిలోల గంజాయి దొరికింది. దీంతో దమ్మపేట ఎఫ్‌ఆర్‌ఓ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గంజాయితో సంబంధంఉన్న నాగుతోపాటు పెనుబల్లి రవి, తాటి సాయికృష్ణ, పెనుబల్లి శ్రీను, తాటి నవీన్‌, సప్పిడి సమ్మయ్యలను అరెస్ట్‌ చేశారు. వీరు ఆంధ్రా–ఒడిశా సరి హద్దు ప్రాంతాలైన చింతూరు, సీలేరు, డొంకరా యి నుంచి గంజాయి తీసుకొచ్చి దమ్మపేటలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. అరెస్ట్‌ చేసి న ఆరుగురు నిందితులను రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. అశ్వారావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎఫ్‌ఆర్‌ఓ శ్రీను, దమ్మపేట ఎస్‌ఐ రాజేష్‌, అదనపు ఎస్‌ఐ బాలస్వామి, పోలీస్‌, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

రేక్‌ పాయింట్‌కు 1,321 మె.టన్నుల యూరియా

చింతకాని: పందిళ్లపల్లి లోని రేక్‌ పాయింట్‌కు ఆదివారం క్రిబ్‌కో కంపెనీకి చెందిన 1,321.20 మెట్రిక్‌ టన్నుల యూరియా చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 521.20 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 500 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 200 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మరో 100 మె.టన్నుల యూరియాను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement