చేపల వేటకు వెళ్లి వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి వృద్ధుడి మృతి

Oct 19 2026 12:43 AM | Updated on Oct 19 2026 12:43 AM

మణుగూరు టౌన్‌: మండలంలోని ముత్యాలమ్మనగర్‌ గ్రామం సంతోష్‌నగర్‌కి చెందిన బోదనగడ్డ వెంకటేశ్వర్లు(66) చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఐతపబోయిన కుంట చెరువులో చేపల వేటకు వెళ్లాడు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం చెరువులో శవమై తేలాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో రైతు ..

చర్ల: మండలంలోని జీపీపల్లిలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రైతు పుచ్చా రమణారెడ్డి (58) ఆదివారం ఉదయం పొలం వద్దకు బయల్దేరాడు. అయితే శనివారం రాత్రి వీచిన గాలిదుమారానికి ఎల్‌టీ విద్యుత్‌ లైన్‌ తెగి కిందకు వేలాడుతోంది. ఆ దారి వెంట వెళ్తున్న రైతుకు వైరు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అటుగా వెళ్తున్న కొందరు రైతులు గమనించి సమాచారం ఇవ్వడంతో విద్యుత్‌ శాఖ అధికారులు కరెంట్‌ సరఫరా నిలిపివేశారు. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చర్ల ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గతంలో రమణారెడ్డి కుమారుడు కూడా విద్యుత్‌ షాక్‌తోనే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిని విద్యుత్‌ బలిగొనడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సంఘటనా ప్రాంతాన్ని ట్రాన్స్‌కో ఏఈ వెంకటేశ్వరావు సందర్శించి వివరాలు సేకరించారు.

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

అశ్వారావుపేటరూరల్‌: పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివా రం మృతి చెందాడు. ఎస్‌ఐ సాయికిశోర్‌ రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన పొండ్రు దుర్గాప్రసాద్‌(28), వ్యవసాయం కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి అలవాటు పడటంతో ఈ నెల 13న భార్య లోవలక్ష్మి మందలించింది. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఏపీలోని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బడ్డీ కొట్టులోకి దూసుకెళ్లిన లారీ

సత్తుపల్లి: అదుపుతప్పి లారీ బడ్డీ కొట్టులోకి దూసుకెళ్లిన ఘటన సత్తుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. సిమెంట్‌ లోడ్‌ తీసుకెళ్తున్న లారీని డ్రైవర్‌ స్థానిక కూరగాయల మార్కెట్‌ వద్ద నిలిపివెళ్లా డు. అయితే, క్లీనర్‌ హ్యాండ్‌ బ్రేక్‌ తీయడంతో ఒకసారిగా వెనక్కి వెళ్తూ బడ్డీ కొట్టుతో పాటు తోపుడు బండి ఢీకొట్ట డంతో ధ్వంసమయ్యాయి. ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement