ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదు

Oct 19 2026 12:43 AM | Updated on Oct 19 2026 12:43 AM

బదిలీ చేసి ఉంటే బతికేవాడు..

భద్రాచలంఅర్బన్‌: పాల్వంచ గ్యాస్‌ గోదాం మేనేజర్‌ అనంతుల లక్ష్మీనారాయణ ఆత్మహత్య కేసులో ఆరుగురిపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచలోని పౌరసరఫరాల సంస్థ ఎల్పీజీ కేంద్రంలో లక్ష్మీనారాయణ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అదే కార్యాలయంలో గతంలో కాంట్రాక్టు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన రజిత వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసేందుకు అనుమతించాలని కోరగా ఆయన నిరాకరించారు. అప్పటి నుంచి అతన్ని ఇబ్బందులకు గురిచేయడంతో 21 రోజులపాటు సెలవులో ఉండి, ఆగస్టు 17న తిరిగి విధుల్లో చేరా డు. అదే నెల 25న రజితతోపాటు మరో ఐదుగురు కార్యాలయానికి వచ్చి సిబ్బంది సమక్షంలో దూషించడంతోపాటు బెదిరించారు. ఈ వ్యవహారంపై సెప్టెంబర్‌ 30న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా డు. ఆ తర్వాత లక్ష్మీనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు రూ.కోటి డిమాండ్‌ చేశారని, అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో వేధింపులు కొనసాగించారని ఆరోపించారు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ శనివా రం భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని గోదా వరి లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి ఆరుగురు బాధ్యులని పేర్కొంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. మృతుడి కుమార్తె మధులిక ఫిర్యాదు మేరకు రజిత, రాజేష్‌, నాగచందు, వెంకన్న, ఖలీం, రవి అనే వ్యక్తులపై శనివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు సీఐ ఎస్‌.రాజు తెలిపారు.

లక్ష్మీనారాయణ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ముందుగానే చర్చించి ధైర్యం చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనను మరో ప్రాంతానికి బదిలీ చేసి ఉంటే తమకు దక్కేవాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద ‘‘బదిలీ చేసి ఉంటే బతికి ఉండేవాడు కదా..’’అంటూ రోదించారు. పోస్టుమార్టం నిర్వహించాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా లక్ష్మీనారాయణ ఉత్తమ అధికారిగా రెండు సార్లు అవార్డు తీసుకున్నాడు.

ఫిర్యాదు ఉపసంహరణకు

రూ.కోటి డిమాండ్‌ చేశారని కుమార్తె ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement