పాల్వంచరూరల్: పాల్వంచ గ్యాస్ గోదాం మేనేజర్ అనంతుల లక్ష్మీనా రాయణ వేధింపుల ఘటనలో భద్రాచలంలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పాల్వంచ ఎన్ ఎండీసీ కాలనీ లోని నివాసానికి తీసుకొచ్చారు. ఆయనకుభార్య భాగ్యలక్ష్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి న ఇద్దరూ కుమార్తెలు ప్రవళ్లిక,మధులిక ఉన్నా రు. కుమారులు లేకపోవడంతో పెద్దకుమార్తె తలకొరివి పెట్టాలని భా వించినా... భార్య భాగ్యలక్ష్మి ముందుకొచ్చింది. దీంతో ఆమె చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు.


